English | Telugu
నెటిజన్‌కి యాంకర్ రవి దిమ్మతిరిగే రిప్లై!
Updated : Jan 31, 2022
బిగ్‌బాస్ షో నుంచి యాంకర్ రవి అనూహ్యంగా బయటికి రావడం చాలా మందిని షాక్ కు గురిచేసింది. టాప్ 5 వరకైనా వుంటాడని కొంత మంది, టైటిల్ ఫేవరేట్ అని కొంత మంది భావించి ప్రచారం చేసిన యాంకర్ రవి అనూహ్యంగా మధ్యలోకే ఇంటిదారి పట్టాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఇక తను హౌస్ లో వుండగా తనని, తన కూతురిని అవమానించారంటూ కొంత మందిపై సైబర్ క్రైమ్ పోలీసులకు యాంకర్ రవి ఫిర్యాదు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజాగా మరోసారి రవిపై ఓ నెటిజన్ కామెంట్ చేయడం.. దానికి రవి కౌంటర్ ఇవ్వడం ఇప్పుటు వైరల్ గా మారింది. బిగ్‌బాస్ హౌస్ లో తాను వ్యవహరించిన తీరుతో నెటిజన్ లకు అడ్డంగా బుక్కైన యాంకర్ రవి.. ఆ తరువాత వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అలా మరెవరూ తనని, తన కుటుంబ సభ్యులని విమర్శించకూడదని పోలీసులని ఆశ్రయించడం తెలిసిందే.
Also Read:రెచ్చిపోయిన మనో..చేతులెత్తి దండం పెట్టిన రోజా
అయితే తాజాగా యాంకర్ రవిని ఓ నెటిజన్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల అభిమానులతో రవి ఇన్ స్టా లైవ్‌లో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు నెటిజన్ లు అడిగిన పలు ప్రశ్నలకు అతను సమాధానలు చెప్పాడు. నీ సంపాదన ఎంత? .. నెలకు ఎంత సంపాదిస్తావ్ ? అని నెటిజన్ లు అడిగిన ప్రశ్నలకు యాంకర్ రవి తెలివిగా సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ నువ్వు `ఫేక్ అనిపిస్తావ్` అనేశాడు.
Also Read:బిగ్ బాస్ ఓటీటీ హంగామా మొదలైందిగా
అయితే దీనికి రవి చాలా ఎగ్రెసీవ్‌గా రియాక్ట్ అవుతాడని అంతా భావించారు కానీ అలా జరగలేదు. చాలా కూల్ గా సమాధానం చెప్పాడు. "సరే.. అది మీ అభిప్రాయం. దాని పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇలా ఒకరిని జడ్జ్ చేస్తున్నారంటే వాళ్లే వీక్ పర్సన్ అన్నట్టు. జనాలు నన్ను జీరో అన్నా హీరో అన్నా.. నేను ఎప్పుడూ ఒకేలా వున్నాను" అని సమాధానం చెప్పాడు రవి.