ఆలియా-రణబీర్ పెళ్లికి అతిథులు 28 మంది!
ఆలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి చుట్టూ ఉన్న ఎగ్జయిట్మెంట్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. వారి పెళ్లి ఎప్పుడనేది ఇంతదాకా అఫిషియల్‌గా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 13, 14, 15.. ఇలా రకరకాల తేదీలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇవేవీ కావు, ఏప్రిల్ 20న వారి పెళ్లి జరగనుందంటూ ప్రచారంలోకి వచ్చింది. ఆలియా సోదరుడు రాహుల్ భట్ ఈ కొత్త తేదీని బయటపెట్టాడు. ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్‌తో మాట్లాడిన అతను, "ఆలియా, రణబీర్ పెళ్లి జరగనున్నదనే విషయం అందరికీ తెలిసిందే.