English | Telugu

మధుబాలకి అంత సీన్ వుందా?

‘రోజా’ సినిమా ద్వారా సినిమా రంగంలో లైమ్‌లైట్‌లోకి వచ్చిన హీరోయిన్ మధుబాల ఆ తర్వాత దాదాపు ఓ అరడజను హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకి అదృష్టం ముఖం చాటేయడంతో సినిమా రంగానికి దూరమై చక్కగా పెళ్ళి చేసుకుని సంసార బాధ్యతలలో మునిగిపోయింది. ఈమధ్యకాలంలో మళ్ళీ సినిమా రంగం మీద మోజు పుట్టుకొచ్చి మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంటరైంది. అమ్మ, అక్క లాంటి పాత్రల్లో కనిపించింది. అయితే మధుబాలలో అంతకు ముందు వున్నంత గ్లామర్ ఏ కోశానా లేకపోవడంతో ఆమెకు అక్క, అమ్మ పాత్రల్లో కూడా పెద్ద డిమాండ్ రాలేదు. ఇలాంటి సమయంలో తెలుగులో హిట్ అయిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కన్నడ రీమేక్‌లో నటించే అవకాశం