గవర్నర్ సాబ్... నా పదవిని కాపాడండి: ఏ పీ పీ ఎస్ సి చైర్మన్
తనపై రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందని ఆరోపిస్తున్న ఈయన పేరు ఉదయభాస్కర్ . హోదా ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. అంటే ఏ పీ పీ ఎస్ సి అనే ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ కు ఈయన పెద్ద దిక్కన్న మాట. అయితే,ఇప్పుడు ఆయనకే దిక్కు లేకుండా పోయిన పరిస్థితి. ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితి లో ఆయన రాజ్ భవన్ మెట్లెక్కారు.