English | Telugu

కరోనా దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్ !

స్టాక్ మార్కెట్ నేలచూపులు మొదలెట్టింది. 2,600 పాయింట్ల నష్టంతో ఈ రోజు ట్రేడింగ్ మొదలైంది. పలు దేశాల్లో లాక్ డౌన్ తో వృద్ధి తగ్గే ప్రమాదం. 8 శాతానికి మించి పడిపోయిన సెన్సెక్స్. నిఫ్టీ-50లో అన్ని కంపెనీలూ నష్టాల్లోనే. కరోనా వైరస్ భయాలు స్టాక్ మార్కెట్ ను ఇంకా వీడలేదు. పలు దేశాల్లో ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వృద్ధి ప్రభావితం అవుతుందంటూ వచ్చిన విశ్లేషణలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి. ఇదే సమయంలో శుక్రవారం నాటి యూఎస్ మార్కెట్ సరళి, నేటి ఆసియా మార్కెట్ల నష్టాలు కూడా ప్రభావం చూపడంతో, ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది.