' లక్ష్మణ రేఖ ' దాటితే, వాహనాలు స్వాధీనం: డి.జి.పి . గౌతమ్ సవాంగ్
కరొనా వైరస్ వ్యాప్తి, తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ డి జి పి గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందనీ, ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలనీ ఆయన సూచించారు. వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలెవరూ రోడ్ల పైకి రావద్దనీ, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలనీ కోరారు.