సీరియల్స్ సక్సెస్.. ప్రొడ్యూసర్గా ఫెయిల్!
బుల్లితెరపై చాలా కాలంగా కొనసాగుతున్న సీరియల్స్ లో 'వదినమ్మ' ఒకటి. దర్శకనిర్మాత, నటుడు ఈటీవీ ప్రభాకర్, సుజిత జంటగా నటిస్తోన్న ఈ సీరియల్ ప్రేక్షకాదరణ పొందింది. ఈ క్రమంలో నటుడిగా, దర్శకనిర్మాతగా తన ప్రస్థానం గురించి ప్రభాకర్ తాజాగా ముచ్చటించారు. 'వదినమ్మ' సీరియల్ లో అసలైన హీరో తను కాదని.. వదినమ్మే సీరియల్ హీరో అని చెప్పుకొచ్చాడు.