English | Telugu
యువకుడిగా.. వృద్ధుడిగా!!
Updated : Jul 9, 2013
తెలుగులో "అపరిచితుడు" పేరుతో అనువాదమైన చిత్రానికంటె ముందే విక్రమ్‌కు తమిళంలో స్టార్‌డమ్ వచ్చింది. "అపరిచితుడు" అనంతరం తెలుగులోనూ మార్కెట్ ఏర్పడి అతగాడు సూపర్‌స్టార్ అయ్యాడు.
అయితే.. ఆ సూపర్‌స్టార్‌డమ్ చాలా కొద్ది కాలం మాత్రమే నిలిచింది. ఎందుకంటె.. "అపరిచితుడు" తర్వాత విక్రమ్ నటించిన సినిమాలన్నీ అసాధారణరీతిలో అపజయం పాలయ్యాయి. ఆ చిత్రాలన్నీ.. "మజా, భీమ, మల్లన్న, విలన్, నాన్న, వీడింతే, శివతాండవం" పేర్లతో డబ్బింగ్ చేయబడి.. తెలుగులోనూ పరాజయం పాలయ్యాయి.
దాంతో మళ్లీ శంకర్ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రంపై విక్రమ్ విపరీతమైన ఆశలు పెట్టుకొన్నాడు. ఈ చిత్రం తెలుగులో "మనోహరుడు" పేరుతో అనువాదం కానుంది. ఈ చిత్రంలో విక్రమ్ 15 ఏళ్ల ప్రాయంగల యువకుడిగానూ.. 85 ఏళ్ల వయస్సుకల వృద్ధుడిగానూ కనిపించి కనువిందు చేయనున్నాడు. ఈ చిత్రంతోనైనా విక్రమ్‌కు పూర్వ వైభవం ప్రాప్తిస్తుందేమో చూడాలి!