English | Telugu

`పుష్ప‌`లో మ‌రో క‌న్న‌డ క‌స్తూరి!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కి బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మికా మంద‌న్నా ఇందులో బ‌న్నీకి జోడీగా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాలుకూ ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప - ద రైజ్` క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. `పుష్ప‌`లో మ‌రో క‌న్న‌డ క‌స్తూరి కూడా సంద‌డి చేయ‌నుంద‌ట‌. కాక‌పోతే, హీరోయిన్ గా కాదు.. బ‌న్నీకి చెల్లెలుగా. ఆ క‌న్న‌డ బ్యూటీ మ‌రెవ‌రో కాదు.. త‌మిళ చిత్రం `96`తో న‌టిగా గుర్తింపు పొందిన వ‌ర్ష బొల్ల‌మ్మ‌. `చూసీ చూడంగ‌నే`, `మిడిల్ క్లాస్ మెలోడీస్` వంటి లో-బ‌డ్జెట్ మూవీస్ లో హీరోయిన్ గానూ.. `జాను` చిత్రంలో స‌హాయ న‌టిగానూ తెలుగువారిని అల‌రించిన వ‌ర్ష‌.. `పుష్ప‌`లో బ‌న్నీకి చెల్లెలిగా క‌నిపించ‌నుంద‌ట‌. అంతేకాదు.. `పుష్ప‌` సెకండ్ పార్ట్ లో ఆమె పాత్ర ఉంటుంద‌ని.. సిస్ట‌ర్ సెంటిమెట్ హైలైట్ గా న‌డిచే రెండో భాగంలో వ‌ర్ష న‌ట‌న ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే `పుష్ప‌`లో వ‌ర్ష ఎంట్రీపై క్లారిటీ రానుంది.

మ‌రి.. ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ తో వ‌ర్ష న‌టిగా ఎలాంటి గుర్తింపుని పొందుతుందో చూడాలి.