English | Telugu

ఈగ సినిమాకు కాపీ.. మూవీ టీమ్ కి లీగల్ నోటీసులు!

 

'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ కి గేట్లు ఓపెన్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. దానికి ముందు తీసిన 'ఈగ'తో పాన్ ఇండియా వైడ్ గా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. వారాహి చలన చిత్రం నిర్మించిన ఈ మూవీ 2012 లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈగ వచ్చిన 13 ఏళ్ళ తర్వాత.. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఓ మలయాళ మూవీ టీమ్ కి నోటీసులు పంపడం సంచలనంగా మారింది.

 

ఇటీవల మలయాళంలో 'లవ్లీ' అనే సినిమా వచ్చింది. ఇది ఈగకు, ఓ యువకుడికి మధ్య జరిగిన కథగా తెరకెక్కింది. అయితే ఇది తమ కాన్సెప్ట్ అంటూ ఈగ మేకర్స్ 'లవ్లీ' టీమ్ లీగల్ నోటీసులు పంపించారు. ఈగ పాత్రను, దాని రూపాన్ని, కదలికలను కాపీ చేశారని ఈగ నిర్మాతలు చెబుతున్నారు. ప్రచార చిత్రాలతో పాటు సినిమాలోనూ ఈగ పాత్రను ఉపయోగించడం ఆపాలని డిమాండ్ చేశారు. అయితే ఈగ నిర్మాతల ఆరోపణలను 'లవ్లీ' టీమ్ ఖండించింది. తాము సొంతంగా డిజైన్ చేశామని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి మునుముందు ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.