English | Telugu

'ది ఘోస్ట్' ఈవెంట్.. ఒకే వేదికపై అక్కినేని హీరోలు

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ది ఘోస్ట్'. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేడుకలో తండ్రీకొడుకులు ఒకే వేదికైన కనిపించనుండటం విశేషం.

 

'ది ఘోస్ట్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న సాయంత్రం కర్నూల్ లోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి నాగార్జున తనయులు యువ హీరోలు నాగ చైతన్య, అఖిల్ హాజరు కాబోతున్నారు. ఇటీవల ఇద్దరిద్దరుగా వేదికను పంచుకున్నారు గాని తండ్రీకొడుకులు ముగ్గురూ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులైంది. ఈ ముగ్గురినీ ఒకే వేదికపై చూసుకోవడం అక్కినేని అభిమానులకు కన్నులపండుగ అని చెప్పొచ్చు.

 

 

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్, గుల్ పానాగ్, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి తదితరులు నటిస్తున్నారు. భరత్-సౌరభ్, మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ముకేశ్, ఎడిటర్ గా ధర్మేంద్ర కాకరాల వ్యవహరిస్తున్నారు.