Read more!

English | Telugu

దసరా బరిలో 'స్వాతిముత్యం'.. 'గాడ్ ఫాదర్', 'ఘోస్ట్' ఉన్నా తగ్గేదేలే!

బెల్లంకొండ గణేష్ ని హీరోగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్టు 13న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్ .

 

'స్వాతిముత్యం' సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన 'స్వాతిముత్యం' ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ దసరాకు చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రాలు విడుదల కానున్నాయి. దసరా బరిలో భారీ చిత్రాలు దిగుతున్నప్పటికీ.. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే 'స్వాతిముత్యం'ను విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తోంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సూర్య, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.