Read more!

English | Telugu

పాయల్ అలా, సన్నీ ఇలా.. మంచు విష్ణుకి కలిసొచ్చేనా!

మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'జిన్నా'. తమ అందచందాలతో కుర్రకారుని ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన విష్ణు ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. తాజాగా పాయల్, సన్నీల ఫస్ట్ లుక్స్ కూడా విడుదలయ్యాయి. ఒకరు పక్కా పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తుంటే, ఇంకొకరు మోడ్రన్ గా సిటీ అమ్మాయిలా కనిపిస్తున్నారు.

'జిన్నా'లో 'పచ్చళ్ళ స్వాతి' పాత్రలో పాయల్ నటిస్తుండగా.. 'రేణుక'గా సన్నీ నటిస్తోంది. రీసెంట్ గా 'పచ్చళ్ళ స్వాతి'గా పాయల్ ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఎర్ర లంగావోణీ ధరించి పాయల్ చాలా గ్లామరస్ గా ఉంది. ఇక తాజాగా 'రేణుక'గా సన్నీని పరిచయం చేస్తూ మరో పోస్టర్ ని విడుదల చేశారు. మోడ్రన్ డ్రెస్ ధరించి అప్పుడే పల్లె వెలుగు బస్సు దిగుతున్నట్లుగా ఉన్న సన్నీ లుక్ ఆకట్టుకుంటోంది. మరి ఈ ఇద్దరి గ్లామర్ 'జిన్నా' సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం సన్నీ, పాయల్ వంటి బ్యూటీలతో పాటు.. బడా బడా టెక్నీషియన్స్ ని కూడా రంగంలోకి దింపాడు.

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.