English | Telugu

ఆమె సునీల్ తో చెయ్యదంట!

"పూల రంగడు", "మిస్టర్ పెళ్ళికొడుకు" చిత్రంలో నటించి మంచి జోడీగా పేరుతెచ్చుకున్నారు హీరో సునీల్ హీరోయిన్ ఇషాచావ్లాలు. అయితే హీరోగా మారిన సునీల్ కు ఈ మధ్య వరుస ఆఫర్లు వస్తూ బిజీగా ఉన్నాడు. కానీ ఇషాకు మాత్రం ఒక్క అవకాశం ఇచ్చే నాధుడే కరువయ్యారు.

ఇదిలా ఉంటే సునీల్ చేయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ గా ఇషాను తీసుకోవాలనుకొని ఇషాను సంప్రదిస్తే... ఇక నేను సునీల్ తో సినిమాలు చేయనని తెగేసి చెప్పేసిందట. దీంతో సునీల్ పక్కన హీరోయిన్ కోసం వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్నారట ఆ చిత్ర నిర్మాతలు. అయితే చేతికొచ్చిన అదృష్టాన్ని కాదనడంతో ఈ అమ్మడికి ఇప్పుడు ఏ ఒక్క అవకాశం కూడా రావట్లేదు. మరి ఈ పాప తరువాత సినిమాలలో కనిపించేది ఐటెం సాంగ్ లలోనేనా అనే విషయం త్వరలోనే తెలియనుంది.