Read more!

English | Telugu

వాళ్ళతో కలిసి శ్రీముఖి...చూడని బొమ్మలు చూపించింది

శ్రీముఖి ఏది చేసిన సెన్సేషన్ ఐపోతుంది. ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కడ చూసినా శ్రీముఖి హవానే నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి జోక్స్, కామెడీ ఫుల్ వైరల్ అవుతూ ఉంటుంది.  తన అందచందాలతో, చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని కొన్నేళ్లుగా అలరిస్తోంది. అంతేకాదు నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3లో ఈమె రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈమె తన ఫ్రెండ్స్ తో ఈవెంట్స్ కోసం ఫారెన్ వెళ్ళినప్పుడు తీసిన పిక్స్ ని, దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ నేచర్ ని కూడా ఫొటోస్, వీడియోస్ తీసి  తన ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు ఒక ఫోటో షూట్ పిక్స్ పోస్ట్ చేసి వాటితో పాటు "అన్ సీన్ పిక్స్" పేరుతో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో చాలా పిక్స్ పోస్ట్ చేసింది. డాన్స్ ఐకాన్ షోలో ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ముక్కు అవినాష్, శ్రీముఖి మంచి ఫ్రెండ్స్. అలాగే శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పేస్తే స్టేజి దద్దరిల్లిపోవాల్సిందే. అలాగే  రమ్య కృష్ణ అంటే శ్రీముఖికి చాలా ఇష్టం. ఇక వీళ్లందరితో దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుని తన ఫాన్స్ కి ఐఫీస్ట్ చేసింది.