Read more!

English | Telugu

ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన 'సీతా రామం'

ఒకేరోజు(ఆగస్టు 5న) విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' రెండు సినిమాలూ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'బింబిసార' మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుండగా.. 'సీతా రామం' కూడా మౌత్ టాక్ తో రోజురోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ ఆరు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది.

 

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా 16.20 కోట్ల బిజినెస్ చేసిన 'సీతా రామం' మూవీ ఆరు రోజుల్లో 18.03 కోట్ల షేర్(35.60 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.11.50 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పటిదాకా 10.28 కోట్ల షేర్(18.95 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఆరు రోజుల్లో నైజాంలో రూ.4.06 కోట్ల షేర్(బిజినెస్ రూ.4 కోట్లు), సీడెడ్ లో రూ.1.15 కోట్ల షేర్(బిజినెస్ రూ.1.5 కోట్లు), ఆంధ్రాలో రూ.5.07 కోట్ల షేర్(బిజినెస్ రూ.6 కోట్లు) వసూలు చేసింది. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా 1.05 కోట్ల షేర్(బిజినెస్ రూ.0.70 కోట్లు), ఓవర్సీస్ లో 3.85 కోట్ల షేర్(బిజినెస్ రూ.2.5 కోట్లు), ఇతర భాషల్లో 2.85 కోట్ల షేర్(బిజినెస్ రూ.1.50 కోట్లు) కలిపి వరల్డ్ వైడ్ గా 18.03 కోట్ల షేర్ రాబట్టి ఇప్పటిదాకా బయ్యర్లకు కోటిగా పైగా లాభాలు తెచ్చిపెట్టింది. 

 

సీడెడ్, ఆంధ్రాలో తప్ప మిగతా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించిన సీతా రామం.. ఆ ప్రాంతాలలో కూడా ఈ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటే అవకాశముంది.