English | Telugu
11 రోజుల్లోనే ‘బాహుబలి2’ని క్రాస్ చేసేసిన ‘సలార్’!
Updated : Jan 3, 2024
రెబల్‌స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే వరల్డ్‌వైడ్‌గా కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్నిచోట్ల సూపర్‌హిట్‌ని ఇంకా దాటలేకపోతోంది. దానికి ఇంకా టైమ్ పడుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే యునానిమస్‌గా టాప్ కలెక్షన్స్ చూపిస్తోంది. 11వ రోజు సాధించిన కలెక్షన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌ను దాటేసి ఒవరల్‌గా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్‌ని సాధించింది. 11 రోజుల్లో రూ.145 కోట్ల షేర్ మార్క్‌ని క్రాస్ చేసి బ్రేక్ ఈవెన్ ని ఇక్కడ అందుకోగా 12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్‌తో లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక బ్రేక్ ఈవెన్‌ని అందుకునే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ కలెక్షన్ ఆరో రోజు నుంచి తగ్గుకుంటూ వచ్చింది. ఆరో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల షేర్ వసూ
సంక్రాంతి వరకు సినిమాకి మంచి టైం ఉండటంతో మిగిలిన చోట్ల హోల్డ్ కొనసాగితే సినిమా టోటల్ లు చేసింది. 7వ రోజు అయితే రూ.2.22 కోట్ల మేర షేర్ వచ్చింది. 8వ రోజు రూ.1.71 కోట్ల మేర షేర్ వసూలైంది. అయితే, 9వ రోజు అంటే శనివారం నుంచి మళ్లీ పుంజుకుంది. ఇక 11వ రోజు సోమవారం కొత్త సంవత్సరం ప్రారంభంకావడంతో ప్రేక్షకులు ‘సలార్’ థియేటర్లకు క్యూ కట్టారు. 11వ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల్లో ఇప్పటివరకు ‘బాహుబలి 2’ రూ.6.80 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పుడు ‘సలార్’ దాన్ని క్రాస్ చేసి అత్యధికంగా రూ.8.28 కోట్లతో టాప్ పొజిషన్‌లోకి వెళ్లిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అయితే 11 రోజుల షేర్ కలెక్షన్ రూ.312.24 కోట్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.578 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణలో ‘సలార్’ రోజువారీ షేర్స్ :
మొదటిరోజు: రూ. 50.29 కోట్లు
2వ రోజు: రూ. 21.23 కోట్లు
3వ రోజు: రూ. 22.40 కోట్లు
4వ రోజు: 18.05 కోట్లు
5వ రోజు: రూ.10 కోట్లు
6వ రోజు: రూ.4.35 కోట్లు
7వ రోజు: రూ.2.22 కోట్లు
8వ రోజు: రూ.1.71 కోట్లు
9వ రోజు: రూ. 2.60 కోట్లు
10వ రోజు: 2.77 కోట్లు
11వ రోజు: రూ.8.28 కోట్లు
మొత్తం: రూ.145.09 కోట్లు
11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా షేర్ వసూలు చేసిన చిత్రాలు..
సలార్ - రూ. 8.28 కోట్లు
బాహుబలి 2 - రూ. 6.80 కోట్లు
ఆర్‌ఆర్‌ఆర్ - రూ. 4.98 కోట్లు
బాహుబలి - రూ. 3.76 కోట్లు
జైలర్ - రూ. 3.28 కోట్లు
మహర్షి - రూ. 3.22 కోట్లు
కె.జి.యఫ్ 2 - రూ. 3.16 కోట్లు
అఖండ - రూ. 3.08 కోట్లు
సైరా నరసింహారెడ్డి - రూ. 2.73 కోట్లు
అల వైకుంఠపురములో - రూ. 2.52 కోట్లు
భగవంత్ కేసరి - రూ. 2.43 కోట్లు
సర్కారువారి పాట - రూ. 2.40 కోట్లు
