English | Telugu

రాజకీయాల్లోకి మెగా మేనల్లుడి ముహూర్తం ఖరారు అయ్యిందా!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej)ప్రస్తుతం హనుమాన్(hanuman)మూవీ ఫేమ్ నిరంజన్ రెడ్డి(niranjan reddy)నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న నూతన చిత్రంలో నటిస్తున్నాడు.రీసెంట్ గా తేజ్ బర్త్ డే సందర్భంగా ఆ మూవీ నుంచి చిన్న పాటి టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అందులోని తేజ్ లుక్ తో పాటు విజువల్స్ కూడా ఒక రేంజ్ లో ఉండటంతో సినిమాపై అందరిలో అంచనాలు పెరిగాయి.

రీసెంట్ గా ఒక వెబ్ సైట్ నిర్వహించిన కార్యక్రమంలో తేజ్ మాట్లాడుతు నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది.మరెన్నో విభిన్నమైన సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను.అందుకే ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు.పాలిటిక్స్ లోకి రావాలంటే ఎన్నో విషయాలని నేర్చుకోవడంతో పాటుగాప్రజా సమస్యలపై అవగాహన కూడా కలిగి ఉండాలి. ప్రస్తుతం ఇది నాకు పునర్జన్మ. యాక్సిడెంట్ తర్వాత చాలా విషయాలని తెలుసుకున్నాను.

బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ని ధరించండి.అదే నా ప్రాణాలు కాపాడిందని వివరించాడు.ఎప్పటినుంచో పలు సామజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న తేజ్ 'అమ్మ ప్రేమ ఆదరణ ట్రస్ట్' ని నిర్వహిస్తూ ఎంతో మందిని వసతి తిండి కల్పిస్తున్నాడు.తేజ్ గత రెండు చిత్రాలైన విరూపాక్ష, బ్రో మంచి విజయాన్ని అందుకోగా కొన్ని నెలల క్రితం తన పేరులో తన తల్లి పేరు వచ్చేలా సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.