Read more!

English | Telugu

బెహ్రెయిన్ లో రౌడీ రోహిణి సందడి...

 

తెలుగు కళా సమితి వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక  కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం కోసం రౌడీ రోహిణి  బెహ్రెయిన్ వెళ్ళింది. ఇక అలా సింగల్ గా వెళ్లిన రోహిణి ట్రావెలింగ్ మొత్తం చెస్ ఆడుకుంటూ గడిపింది . ఐతే నిద్రపోకుండా షూటింగ్ చేసేసరికి  ఎయిర్పోర్ట్ లో స్లీపింగ్ చైర్స్ లో కాసేపు రెస్ట్ తీసుకుంది. తర్వాత కార్ లో వెళ్తూ సిటీ మొత్తాన్ని చూపించింది. షాపింగ్ కి వెళ్లి కావాల్సినవి కొనుక్కున్నారు రోహిణి వాళ్ళా ఫ్రెండ్స్.

తన ఛానల్ ని ఫాలో అయ్యేవాళ్ళు కనిపించేసరికి వాళ్ళతో కలిసి సరదాగా ఫోటోలు దిగింది. తర్వాత బెహ్రెయిన్ లో ఉన్న తెలుగు రెస్టారెంట్ లాంటెర్న్స్ కి వెళ్లి అక్కడి వాళ్ళను సరదాగా ఆట పట్టించింది. ఫైనల్ గా బీచ్ కి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేసింది రోహిణి. ఇక అక్కడ రాళ్ల మీద ఎక్కి ఫోటోలు దిగింది అక్కడి రంగు రంగుల చిలకల్ని కూడా చూపించింది. ఇలా  తన బెహ్రెయిన్ ప్రయాణాన్ని మొత్తం కూడా చూపించింది రౌడీ రోహిణి.