English | Telugu

రేణు కోపానికి ముగ్గురు ఔట్

పవన్ కళ్యాణ్ దర్శకుడిగా మారి "జానీ" చిత్రం తెరకెక్కించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా అతని భార్య రేణుదేశాయ్ నిర్మాతగా మారి ఓ మరాఠి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలిసింది.

చిత్ర యూనిట్ కు కాస్త కూడా పని ఎలా చేయాలో కూడా తెలియదని కోపంతో ఊగిపోతుందట. రేణు కోపానికి ఆ సినిమాకు పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్, కెమెరామాన్ లు పని మానేశారట. దీనివల్ల సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు తెలిసింది. మరి ఈ విషయం పై రేణుకి పవన్ ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తాడో లేదో చూడాలి.