English | Telugu

అది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం.. మళ్ళీ రష్మిక షో మొదలవ్వబోతుందా!

రష్మిక,(Rashmika)విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ఎంగేజ్మెంట్ శుక్రవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ ఇద్దరు అధికారకంగా వెల్లడి చెయ్యకపోయినా, దాదాపుగా అన్ని మీడియా చానల్స్ ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా వెల్లడి చేసాయి. పైగా ఈ విషయాన్ని ఖండించకపోవడంతో ఎంగేజ్మెంట్ జరిగినట్టుగానే భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సినిమాల పరంగా బిజీగానే ఉన్నారు. రష్మిక నుంచి మాత్రం అప్ కమింగ్ మూవీగా 'థామ' ఈ నెల 21 న విడుదల కానుంది. అగ్ర హీరో 'ఆయుష్మాన్ ఖురానా' తో రష్మిక జత కడుతుంది. 'చావా'ని నిర్మించిన మాడ్డాక్ ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఆదిత్య సర్పోత్దార్(Aditya Sarpotdar)దర్శకుడు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి 'తుమ్ మేరే నా హుయే'(Tum Mere Na Huye)అనే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

రీసెంట్ గా ఈ సాంగ్ గురించి రష్మిక 'ఎక్స్(X)'వేదికగా స్పందిస్తు 'ఈ సాంగ్ ని అనుకోకుండా షూట్ చెయ్యడం జరిగింది. మేము ఒక అద్భుతమైన ప్రదేశంలో పన్నెండు రోజుల పాటు షూటింగ్ చేసాం. చిత్రికరణ చివర రోజు మా దర్శక నిర్మాతలు ఈ లొకేషన్ ఎంతో బాగుంది కదా, ఒక సాంగ్ ని ఎందుకు షూట్ చేయకూడదని అనుకున్నారు. ఆ ఆలోచన నాతో పాటు యూనిట్ అందరకి నచ్చింది. దాంతో మూడు రోజులు రిహార్సల్స్ చేసి షూట్ చేసాం. మేము అనుకున్న దానికంటే సాంగ్ బాగా వచ్చింది. అవుట్ ఫుట్ చూసాక మేమే ఆశ్చర్యపోయాం. రేపు థియేటర్ లో సాంగ్ ని అందరు ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చింది.

రష్మిక చెప్పినట్టే సదరు సాంగ్ లొకేషన్ ఎంతో కొత్తగా ఉంది. అసలు ఇంతవరకు అలాంటి లొకేషన్ సిల్వర్ స్క్రీన్ పై రాలేదనే చెప్పుకోవాలి. రష్మిక కూడా సాంగ్ కి తగ్గట్టే తన అందంతో, డాన్స్ తో ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసింది. దీంతో థియేటర్ లో రష్మిక పూర్తి పెర్ఫార్మ్ చూడాలని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తు ఉన్నారు. కొన్ని వందల మంది డాన్సర్ ల మధ్య ఆ సాంగ్ పిక్చరైజేషన్ జరగగా, రొమాంటిక్ కామెడీ హర్రర్ గా 'థామ' తెరకెక్కింది.

విజయ్ దేవరకొండతో కస్తూరి ఐటెం సాంగ్

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఇక ఆయనకు కస్తూరి కూడా మంచి ఫ్యాన్. ఆమె ఆయన గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. "మీకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా నటించమంటే నటిస్తారా" అంటూ హోస్ట్ అడిగింది. "నేను ఇలా చెప్తాను. విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా కాకుండా వేరే రోల్ వస్తే ఈ రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుంటా. విజయ్ తో నేను సిస్టర్ గా ఎందుకు చేయాలి ? జోడిగా చేయాలనీ అనుకోలేదు. ఒక వేళా వస్తే ఫటకాగా ఒక ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ." అని చెప్పింది . ఇక హోస్ట్ ఐతే "ఒకవేళ మీ హజ్బెండ్ వచ్చి విజయ్ దేవరకొండను బ్రో అని పిలవమంటే పిలుస్తారా" అని అడిగింది.