Read more!

English | Telugu

అలీకి ఇన్‌స్పిరేష‌న్ ఈ లెజెండ‌రీ క‌మెడియ‌న్‌!

ఆలీ మంచి కమెడియన్ గా అందరికీ పరిచయమే. టైమింగ్ ఉన్న కామెడీతో అందరి మనసులను దోచుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి మూవీస్ లో కమెడియన్ గా, సైడ్ యాక్టర్ గా, హీరో గా  కూడా నటించిన వ్యక్తి. ఐతే ఆలీకి రాజబాబు అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అనే వాడు ఎవరికైనా సాయం కావాల్సి వస్తే జేబులో ఎంతుంటే అంత తీసి ఇచ్చేస్తారు అలాంటి గుణం ఉన్న వారు చాలా మంది ఉన్నారు అని చెప్పుకొచ్చారు. అలా ఒకానొక టైంలో రాజబాబు గారికి కూడా హెల్ప్ చేసినట్లు చెప్పుకొచ్చారు. కమెడియన్స్ అంతా కలిసి తమ దగ్గర ఉన్న డబ్బుతో ఆయన్ని ఆదుకున్నట్లు ఈ షోలో చెప్పారు. రాజబాబు గారు కూడా ఎంతో హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అన్నారు. అలాగే పిల్లలు ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చేస్తారు అంటూ మర్చిపోలేని ఒక సంఘటన చెప్పారు.

ఒక రోజు తాను రాజబాబు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తన ఐదేళ్ల పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నప్పుడు ఆ పిల్లాడి ముందు నుంచి ఒక ఫారెన్ కారు అలా వెళ్లిపోయేసరికి ఆ పిల్లాడు ఆ కారు కావాలని రాజబాబుని అడిగాడట. వెంటనే ఆ కార్ శివాజీ గారి ఇంటికి వెళ్లిందని తెలుసుకున్న రాజబాబు ఆయన దగ్గరకు వెళ్లారట. ఆయన ఏంటి ఇలా వచ్చావ్..ఎలా వున్నావ్ అని అడిగేసరికి తాను  బాగున్నానని చెప్పేసి ఈ కార్ ఎవరిదీ ? అని శివాజీ గారిని అడిగారట.

నాదే అని చెప్పేసరికి ఆ కార్ తనకు కావాలని అడిగారట. ఐనా కార్ నీకు ఎందుకు అని రాజబాబుని శివాజీ అడిగారట. నాకు కావాలి అంతే. ఎంతో చెప్పండి అని ఆ కార్ కి మూడు లక్షలు ఇచ్చి కొని తీసుకొచ్చి తన పిల్లాడికి గిఫ్ట్ గా ఇచ్చారట. పిల్లలంటే అంత ప్రేమ ఆయనకి , ఆయన చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అని ఆనాటి రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఇద్దరు కొడుకులు ఇప్పుడు ఫారెన్ లో మల్టీ మిల్లీనియర్స్ అని చెప్పుకొచ్చారు ఆలీ.