English | Telugu

ఫ్యాన్స్ ని భయపెడుతున్న నెగటివ్ సెంటిమెంట్.. ప్రభాస్ బ్రేక్ చేస్తాడా..?

సినిమా వాళ్ళకి సెంటిమెంట్ లు ఎక్కువ అంటుంటారు. సినీ అభిమానులు కూడా తమ హీరోల సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్ లను ఫాలో అవుతుంటారు. ఇప్పుడదే కోవలో 'రాజా సాబ్' మూవీ విషయంలో ఒక నెగటివ్ సెంటిమెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. (Prabhas)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'రాజా సాబ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'రాజా సాబ్'.. బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అదే సమయంలో ఒక నెగటివ్ సెంటిమెంట్ ని చూసి.. కొందరు ఫ్యాన్స్ టెన్షన్ పెడుతున్నారు. (Raja Saab)

ప్రభాస్ కెరీర్ లో 'R' లెటర్ తో ఇప్పటిదాకా 'రాఘవేంద్ర', 'రెబల్', 'రాధేశ్యామ్' అనే మూడు సినిమాలు రాగా.. మూడూ ఫ్లాప్ అయ్యాయి. అందుకే 'రాజా సాబ్' రిజల్ట్ విషయంలోనూ అదే జరుగుతుందేమోనని కొందరు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం అసలు 'రాజా సాబ్' సినిమాకి 'R' సెంటిమెంట్ పట్టించుకోవాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. పూర్తి టైటిల్ 'ది రాజా సాబ్' (The Raja Saab) కాబట్టి, ఫస్ట్ లెటర్ 'T'నే అవుతుందని అంటున్నారు. మరికొందరైతే.. అసలు 'R' అయినా టెన్షన్ అక్కర్లేదని, ఈసారి 'రాజా సాబ్'తో ప్రభాస్ ఆ సెంటిమెంట్ ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడని నమ్మకంగా ఉన్నారు. ఎలాంటి సెంటిమెంట్ అయినా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ అవుతుందని, రాజమౌళితో సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ 'దేవర'తో బ్రేక్ అయిందని.. అలాగే ఈ 'R' సెంటిమెంట్ కూడా 'రాజా సాబ్'తో బ్రేక్ అవుతుందని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

విజయ్ దేవరకొండతో కస్తూరి ఐటెం సాంగ్

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఇక ఆయనకు కస్తూరి కూడా మంచి ఫ్యాన్. ఆమె ఆయన గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. "మీకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా నటించమంటే నటిస్తారా" అంటూ హోస్ట్ అడిగింది. "నేను ఇలా చెప్తాను. విజయ్ దేవరకొండ గారికి సిస్టర్ గా కాకుండా వేరే రోల్ వస్తే ఈ రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుంటా. విజయ్ తో నేను సిస్టర్ గా ఎందుకు చేయాలి ? జోడిగా చేయాలనీ అనుకోలేదు. ఒక వేళా వస్తే ఫటకాగా ఒక ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ." అని చెప్పింది . ఇక హోస్ట్ ఐతే "ఒకవేళ మీ హజ్బెండ్ వచ్చి విజయ్ దేవరకొండను బ్రో అని పిలవమంటే పిలుస్తారా" అని అడిగింది.