Read more!

English | Telugu

పర్మిషన్ లేకుండా అలా చేస్తే కోపం రాదా?

నిఖిల్ కార్తికేయ సీక్వెల్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ఎక్కువగా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నారు చందు మొండేటి, నిఖిల్. మొదటి నుంచి నిఖిల్ ప్రత్యేకమైన పాత్రలు ఎంచుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అర్జున్ సురవరం మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీ తర్వాత పాండమిక్ వచ్చేసరికి తన నుంచి మరో సినిమా రావడం ఆలస్యమయ్యిందని నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు కార్తికేయ - 2 , 18 పేజెస్, స్పై మూవీస్ రాబోతున్నట్లు చెప్పాడు. త్వరలో కార్తికేయ సీక్వెల్ రాబోతోందని ఈ మూవీలో మెయిన్ ఎలిమెంట్ ద్వాపర యుగానికి, ద్వారకా నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ  అల్లుకున్న ఒక కథ అని చెప్పుకొచ్చాడు. ఓటిటి ప్లేట్ ఫార్మ్స్ నుంచి ఈ మూవీకి భారీగా ఆఫర్స్ వచ్చాయని కానీ ఇది థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అని ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటే టీమ్ లో ఎంగ్జైటీ పెరిగిపోతోందన్నారు. ఇక తాను స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవుతానంటూ వస్తున్న కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదన్నారు. ఒక్కోసారి స్క్రిప్ట్ అంతా విని ఓకే చెప్పేసాక సెట్స్ మీద చేంజ్ ఐపోతే ఆ టైంలో ఎవ్వరికైనా కోపం వస్తుంది. కథ చదివినప్పుడు రోల్ ని ఎలా సెట్ చేసుకోవాలో మైండ్ లో ఫిక్స్ ఇపోతాం. కానీ మార్పులు చేసినప్పుడు ఆ ఫీల్ అనేది రాదు. నాచురాలిటీ మిస్ అవుతుంది.. మళ్ళీ కొత్త స్క్రిప్ట్ కి అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది కదా అని చెప్పాడు.

ముందు చెప్పిన స్టోరీని ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే మాత్రం స్క్రిప్ట్ లో జోక్యం చేసుకుని నిఖిల్ మొత్తం మార్చేస్తాడని ప్రచారం చేస్తూ ఉంటారు. ఒకసారి  స్టోరీ ఫిక్స్ అయ్యాక ఎవరి ప్రమేయం లేకుండా కథను మార్చేయడం తప్పు. అలాంటి టైంలో బాగా కోపం వస్తుంది అంటూ మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.