Read more!

English | Telugu

'NBK 108' అధికారిక ప్రకటన.. ఈ ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చే!

నటసింహం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన తదుపరి సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

 

'NBK 108'ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది  నిర్మించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఇటీవల బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ పని చేస్తుండటం విశేషం. 'అఖండ'లో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ కి, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇప్పటికే 'NBK 107' కోసం థమన్ వర్క్ చేస్తుండగా.. తాజాగా 'NBK 108' కోసం కూడా థమనే రంగంలోకి దిగుతున్నాడు.

 

బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటించనుందని గతంలో అనిల్ చెప్పాడు.