Read more!

English | Telugu

ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహంలో సందడి చేసిన ఇండస్ట్రీ సెలెబ్స్

టాలీవుడ్ కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఫాతిమా మ్యారేజ్ సెట్ ఐన దగ్గర నుంచి ప్రతీ విషయాన్ని జుబేదా ఆలీ  సోషల్ మీడియాలో ఫాన్స్ తో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. ఇటీవల జరిగిన  ఎంగేజ్మెంట్ ఫంక్షన్ , హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక అలీ-జుబేదా కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇక ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, మంచు లక్ష్మి, మురళి మోహన్, బ్రహ్మానందం, బండ్ల గణేష్, అరియనా గ్లోరీ, జ్యోతక్క, రౌడీ రోహిణి, వరుణ్ సందేశ్, వితిక, ఉదయభాను ఇలా ఎంతోమంది బిగ్ బాస్ సెలబ్రిటీస్, స్మాల్ స్క్రీన్ యాక్టర్స్, యాంకర్స్, కమెడియన్స్  ప్రతీ ఒక్కరూ  ఈ పెళ్లి వేడుకకు వచ్చి ఫాతిమాని విష్ చేశారు. ఇక నెటిజన్స్ కూడా ఆలీ  దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.