English | Telugu

"క్రిష్"కు బ్రెయిన్ సర్జరీ

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. "క్రిష్ 3" చిత్ర షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ హృతిక్ తలకు గాయం అవడంతో వైద్యులు సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. దాంతో ఆదివారం ముంబైలోని హిందుజా హాస్పిటల్ లో మద్యాహ్నం 2 గంటలకు హృతిక్ కు ఆపరేషన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇది కేవలం చిన్న ఆపరేషన్ మాత్రమేనని, భయపడాల్సింది ఏం లేదని హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ మీడియాకు తెలిపారు.