Read more!

English | Telugu

'వీర సింహా రెడ్డి'లో 'జై బాలయ్య' సాంగ్ పెట్టడానికి కారణమిదే!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి అలరించారు. గత చిత్రం 'అఖండ'లో కూడా డ్యూయల్ రోల్ తో అదరగొట్టి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన తదుపరి చిత్రం 'వీర సింహా రెడ్డి'లోనూ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం 'వీర సింహా రెడ్డి'. ఈ చిత్రం నుంచి తాజాగా 'జై బాలయ్య' అనే సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర పేరు 'వీర సింహా రెడ్డి' కాబట్టి ఆ పేరునే సినిమా టైటిల్ గా పెట్టారు అనుకోవచ్చు. కానీ మరి ఈ 'జై బాలయ్య' సాంగ్ ఏంటనే సందేహాలు వ్యక్తమవుయ్యాయి. అయితే ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. ఒక పాత్ర పేరు 'వీర సింహా రెడ్డి' కాగా మరో పాత్ర పేరు 'బాల నరసింహా రెడ్డి' అని తెలుస్తోంది. అందుకే 'జై బాలయ్య' అనే సాంగ్ పెట్టారట. అంతేకాదు గతంలో ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్ కూడా పరిశీలించి చివరికి 'వీర సింహా రెడ్డి'కి ఓటేశారు.

'వీర సింహా రెడ్డి' నుంచి ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలను గమనించినా ఇందులో బాలయ్యది డ్యూయల్ రోల్ అని అర్థమైపోతుంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బ్లాక్ షర్ట్, లుంగీ ధరించిన లుక్ 'వీర సింహా రెడ్డి'ది కాగా, వైట్ అండ్ వైట్ ధరించిన లుక్ 'బాల నరసింహా రెడ్డి'ది అని చెప్పొచ్చు.