English | Telugu
ప్రముఖ బిజినెస్ మాన్ తో అవికా గోర్ పెళ్లి..అతను ఎవరో కాదు
Updated : Jun 12, 2025
'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ తో విశేష ఖ్యాతిని గడించిన నటి 'అవికా గోర్'(Avika Gor). ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో చేసిన అవికా, తెలుగులో అక్కినేని నాగార్జున(Nagarjuna)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన 'ఉయ్యాలా జంపాల' తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఆరంగ్రేటం చేసింది. ఆ తర్వాత లక్ష్మిరావే మా ఇంటికి, ఉయ్యాలా జంపాలా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3 ఉమాపతి వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది.
రీసెంట్ గా అవికా కి బిజినెస్ మాన్, సామాజిక కార్యకర్త, తన ప్రియుడైన 'మిలింద్ ఛద్వాని'(Milind Chandwani)తో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఇనిస్టాగ్రమ్(Instagram) వేదికగా అభిమానులతో పంచుకున్న అవికా ' ఈ విషయంపై స్పందిస్తు 'అతడు ప్రపోజ్ చేస్తే, నేను నవ్వడంతో పాటు ఏడ్చాను. ఆ తర్వాత గట్టిగా అరిచి ఎస్ చెప్పాను. నా జీవితంలో అతి సులభమైన ఎస్ ఇదే. అతడు తన మనసులో ఉన్నది బయటపెట్టగానే పూర్తిగా సినీ ప్రేమికురాలిగా మారిపోయాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపించడంతో పాటు స్లో మోషన్స్ లో వేడుక విజువల్స్ కనిపించాయి. అదే సమయంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఇది నిజమైన ప్రేమ. ఇదొక మ్యాజిక్ అంటు ఇనిస్టా లో పోస్ట్ చేసింది.
అవికా ఈ ఏడాది మార్చిలో ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన 'షణ్ముఖ' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'పాప్ కర్న్' అనే మూవీకి నిర్మాతగాను వ్యవహరించింది. ఈ ఏడాదే వివాహం జరిగే అవకాశం ఉంది.
