Read more!

English | Telugu

తలకు సర్జరీ అయ్యింది..అందుకే రాంప్రసాద్ ఫంక్షన్ కి రాలేకపోయాడు

జబర్ధస్త్ కామెడీ షో అంటే ముందుగా గుర్తొచ్చే కమెడియన్ ఫ్రెండ్స్  ఆటో రాంప్రసాద్, సుధీర్, గెటప్ శీను.  వీళ్ల కాంబినేషన్ ఎప్పుడూ సో స్పెషల్ గానే ఉంటుంది. ఇక కొంత కాలం క్రితం ఈ షో నుంచి వెళ్లిపోయిన గెటప్ శీను, సుడిగాలి సుధీర్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సుధీర్ బుల్లి తెర మీదే కాకుండా అటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు... ‘గాలోడు’ మూవీలో నటించి కమర్షియల్ గా సక్సెస్ ని అందుకున్నాడు. ఐతే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే  ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కాని,  సక్సెస్ మీట్ లో గెటప్ శ్రీను తప్ప ఆటో రాంప్రసాద్ ఎక్కడా కనిపించలేదు.

రాంప్రసాద్ రాకపోవడానికి కారణమేంటా ? అని తెగ ఆరా తీశారు ఆడియన్స్. ఐతే రీసెంట్ గా ఈ మూవీ ఈవెంట్ లో ఈ ముగ్గురూ కలిసి కేక్ తినిపించుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐతే  ఈ ఫోటోలో రాంప్రసాద్ తన  తలకి ఒక కవర్ చుట్టుకుని ఆడియన్స్ కి కనిపించి షాకిచ్చాడు. ఆ ఫోటో చూసిన వాళ్లంతా అసలు  ఆటో రాంప్రసాద్ కి ఏమైంది ? ఎందుకు రాలేదంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు రాంప్రసాద్ గురించి ఓ న్యూస్  చెప్పాడు గెటప్ శ్రీను. రాంప్రసాద్ తలకు సర్జరీ ఐన కారణంగా ఫంక్షన్ కి రాలేకపోయాడని అన్నాడు. ఐతే రాంప్రసాద్  హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.