Read more!

English | Telugu

అది నేను కాదు..నా పేరుతో క్రియేట్ చేసిన ఫేక్ ఐడి...

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. చిన్నచిన్న యూట్యూబర్స్ ఈ హౌస్ లోకి వెళ్లి వచ్చాక స్టార్స్ ఇపోయారు. వెలుగులోకి రాని  ఎందరినో బిగ్ బాస్ సెలబ్రిటీలుగా నిలబెట్టింది. అలా ఇప్పుడు ఎంతోమంది బిగ్ బాస్ పుణ్యమా అని మంచి కెరీర్స్ లో బిజీ ఇపోయారు. అలాంటి వాళ్ళల్లో అరియానా గ్లోరీ కూడా ఒకరు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అరియానా ఇప్పుడు తన నెటిజన్స్ కి ఒక హెచ్చరిక జారీ చేసింది.

తన పేరుతో, ఫొటోతో సోషల్ మీడియాలో ఎవరో ఫేక్ ఐడి క్రియేట్ చేశారని.. అది తన నెంబర్ కాదు అని జాగ్రత్తగా ఉండండి అని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఫాన్స్ కి, నెటిజన్స్ కి ఒక హింట్ ఇచ్చింది. వర్మ హీరోయిన్  అనిపించుకున్న అరియానా బిగ్‌బాస్ షోతో మంచి  పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. రాజ్ తరుణ్‌తో కలిసి "అనుభవించు రాజా" అనే మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ పోషించింది. ఐతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సెలెబ్స్ కి మాత్రం ఈ ఫేక్ ఐడీల గోల మాత్రం తప్పడం లేదు.