English | Telugu
పూరీ "హార్ట్ ఎటాక్" కు అనూప్ సౌండ్
Updated : Jul 8, 2013
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నాడు.
నితిన్-అనూప్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని చిత్రాలు మ్యూజిక్ పరంగా సూపర్ హిట్టయ్యాయి. అయితే నితిన్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇది మొదటి చిత్రం కావడం. అదే విధంగా పూరీ-అనూప్ ల కాంబినేషన్ లో కూడా ఇదే మొదటి చిత్రం అవడం విశేషం. అయితే "ఇష్క్", "గుండెజారి గల్లంతయ్యిందే" చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రంతో ఎలాగైనా నితిన్ తో హాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు అనూప్.
ప్రస్తుతం నితిన్ "కొరియర్ బాయ్ కళ్యాణ్" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అదే విధంగా అనూప్ "మనం", "ఆటోనగర్ సూర్య" వంటి పెద్ద పెద్ద చిత్రాలతో బిజీగా ఉన్నాడు.