English | Telugu

'విశ్వంభర' టీజర్.. హాలీవుడ్ రేంజ్ లో మెగా మాస్!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. (Vishwambhara Teaser)

విజయదశమి కానుకగా 'విశ్వంభర' టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. నిమిషంన్నర నిడివి గల ఈ టీజర్ విజువల్ వండర్ లా ఉంది. "విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నను పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్ధాన్ని తీసుకొస్తుంది." అని వాయిస్ వస్తుండగా అద్భుతమైన విజువల్స్ తో టీజర్ సాగింది. అవతార్ సినిమా తరహాలో మనుషులు, జంతువుల రూపాలు కొత్తగా ఉండటం విశేషం. ఇక ఒక చిన్న పాప "రుద్రా.. యుద్ధం వస్తుంది అన్నావుగా.. ఎలా ఉంటుంది ఆ యుద్ధం" అని అడగగా.. రెక్కల గుర్రం మీద చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది. విజువల్స్, మ్యూజిక్ అన్నీ టాప్ క్లాస్ లో ఉన్నాయి. టీజర్ చూస్తుంటే.. ఈ సినిమాతో దర్శకుడు వశిష్ట చిరంజీవితో కలిసి సంచలనం సృష్టించబోతున్నాడని అర్థమవుతోంది.

కాగా, 'విశ్వంభర' చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ కి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.