English | Telugu

బాలయ్య, చరణ్ ని ఢీ కొడుతున్న సుమంత్!

2025 సంక్రాంతికి 'NBK 109'తో నందమూరి బాలకృష్ణ, 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్ బరిలోకి దిగుతున్నారు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే సంక్రాంతి సమరానికి సై అంటూ సడెన్ గా సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు.

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ చెప్పారు. బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించడం కంటెంట్ మీద నమ్మకమా? లేక ప్రమోషనల్ స్టంట్ ఆ? అనేది తెలియాల్సి ఉంది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.