English | Telugu

సాదాసీదాగా "సాహసం" !!

ఒకటిన్నర సంవత్సరం అనంతరం గోపీచంద్ సినిమా విడుదలవుతోంది. అయినా సరే, ఎందుకోగానీ ఆ చిత్రానికి మినిమమ్ క్రేజ్ కూడా లేకుండాపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ చిత్రం "సాహసం". గోపీచంద్ ప్రీవియస్ మూవీస్ "వాంటెడ్, మొగుడు" చిత్రాలు అట్టర్‌ ఫ్లాపవ్వడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ.. పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉండడంపై కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు చిత్ర పరిశీలకులు.

"సాహసం"లో జంటగా నటిస్తున్న గోపీచంద్_తాప్సీ ఇంతకుముందు "మొగుడు"లో నటించారు. అలాగే "సాహసం" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న "చంద్రశేఖర్ ఏలేటి" ఇంతకుమునుపు గోపీచంద్‌తో "ఒక్కడున్నాడు" చిత్రం తీసారు. ఈ రెండు చిత్రాలు (మొగుడు, ఒక్కడున్నాడు) బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లాపడ్డాయి.

ఇకపోతే "సాహసం" చిత్రం నిర్మిస్తున్న బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఇంతకుముందు "దేవుడు చేసిన మనుషులు_ఒంగోలు గిత్త" వంటి "కళాఖండాలు" నిర్మించి ఉన్నారు. ఈ కారణాలన్నిటివల్ల.. "సాహసం" చిత్రం ఈనెల 12న అత్యంత సాదాసీదాగా విడుదలవుతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న "సాహసం" రేపు విడుదలయ్యాక అద్భుతాలేమైనా చేస్తుందేమో చూడాల్సిందే!

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.