English | Telugu

సొంత ఇంటికి దూరమైన ప్రియాంక చోప్రా.. మహిళలకి ప్రాధాన్యత ఇస్తే ఇలాగే మాట్లాడతారు 

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ 'ప్రియాంక చోప్రా'(Priyanka Chopra)కి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైనది. 2002 లో 'ఇళయ దళపతి విజయ్'(Vijay)హీరోగా తెరకెక్కిన 'తమీజాన్' అనే తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక, ఆ తర్వాత హిందీ చిత్ర రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన సత్తా చాటింది. 2018 లో అమెరికన్ పాప్ సింగర్ 'నిక్ జోనాస్'(Nick Jonas)ని పెళ్లి చేసుకున్నాక, అమెరికన్ చిత్రాలతో పాటు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఈ నెల 2 న హెడ్స్ ఆఫ్ స్టేట్' అనే మరో అమెరికన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ లో ప్రియాంక మాట్లాడుతు 'మహిళా క్యారక్టర్ నేపథ్యంలో జరిగే యాక్షన్ మూవీ కావడం వల్లే 'హెడ్స్ ఆఫ్ స్టేట్'(Heads Of state)ఒప్పుకున్నాను. నాకు మొదటి నుంచి ఇలాంటి కథలు అంటేనే ఇష్టం. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తులోను మరింతగా మహిళా ప్రాధాన్య చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. హాలీవుడ్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడపడం వల్ల ఇండియాని, హిందీ సినిమాని చాలా మిస్ అవుతున్నాను. సొంత ఇంటికి దూరమయ్యాననే భావన కూడా కలుగుతుంది. ఈ ఏడాది ఒక భారతీయ చిత్రంలో నటిస్తున్నాను . ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. భారతీయ సినిమా ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమని చూపిస్తారు. ఆ ప్రేమ ఎప్పటికి అలాగే ఉండాలని చెప్పుకొచ్చింది.

ప్రియాంక చోప్రా చివరిగా 2021 లో 'ది వైట్ టైగర్' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఆమె ప్రపంచ సినీ ప్రేమికులే టార్గెట్ గా తెరకెక్కుతున్న 'మహేష్ బాబు'(Maheshbabu)'రాజమౌళి'(ss Rajamouli)మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే ఆమెపై కొంత భాగం చిత్రీకరణ జరిపారు. 'రామ్ చరణ్'(Ram Charan)తో గతంలో 'తుఫాన్' అనే సినిమాలో కూడా జోడి కట్టిన ప్రియాంక, 2000 సంవత్సరానికి సంబంధించి మాజీ ప్రపంచ సుందరిగా నిలిచి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసింది.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.