English | Telugu
ఫిష్ వెంకట్ కి అండగా ప్రభాస్.. ఏకంగా 50 లక్షలు!
Updated : Jul 4, 2025
ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోయాయని, ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలుస్తోంది. తమను ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యులు కూడా కోరారు. ఈ విషయం ప్రభాస్ కి చేరడంతో.. ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమైన మొత్తాన్ని తాను ఇస్తానని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం.
ప్రభాస్ టీం తాజాగా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను సంప్రదించిందట. ఆపరేషన్ కోసం ఎంత ఖర్చయినా భరిస్తామని, కిడ్నీ దాతను చూసుకోవాలని ప్రభాస్ టీం చెప్పిందట. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కుమార్తె తెలిపారు. అంతేకాదు, ఆపరేషన్ కోసం రూ.50 లక్షలు దాకా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.