English | Telugu

3 నెలల్లో 3 సినిమాలు

జులైలో ఒకటి, ఆగస్టులో ఒకటి, సెప్టెంబర్‌లో ఒకటి. మూడు నెలల్లో ముచ్చటగా మూడు సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్నాయి. ఈ మూడు చిత్రాల్లో రెండు చిత్రాలు రామ్‌చరణ్‌వి కాగా.. ఒకటి పవన్‌కళ్యాణ్‌ది. రామ్‌చరణ్_శృతిహాసన్ జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న "ఎవడు" ఈనెల (జులై) 25న విడుదలవుతుండగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ నటిస్తున్న "అత్తారింటికి దారేది" ఆగస్ట్ సెకండాఫ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే.. హిందీ సినిమాల రిలీజ్ డేట్స్‌ను రెండు మూడు నెలల ముందే ప్రకటించడం ఆనవాయితీ కాబట్టి.. "జంజీర్" (తెలుగులో "తుఫాన్") విడుదల తేదీని సెప్టెంబర్ 6గా ఈమధ్యే అనౌన్స్ చేసారు.

ఇకపోతే.. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని, రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న అల్లు అర్జున్ "రేసు గుర్రం" కూడా సకాలంలో సిద్ధమైతే.. ఆ చిత్రం కూడా అక్టోబర్‌ లేదా నవంబర్‌లో విడుదలయ్యే అవకాశముంది. అల్లు శిరీష్ ఇప్పటికే హీరోగా మారి ఉండడం.. సాయిధరమ్‌తేజ్ "రేయ్" త్వరలో రానుండడం, నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ త్వరలో హీరోగా మారుతుండడం దృష్టిలో పెట్టుకొన్నప్పుడు.. భవిష్యత్‌లో మెగా ఫ్యామిలీ నుంచి నెలకో సినిమా రావడం ఖాయం!

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.