English | Telugu
"పైసా" పరిస్థితేంటి?
Updated : Jul 8, 2013
ఏ ముహూర్తాన ఆ సినిమాకు "పైసా" అనే టైటిల్ ఫిక్స్ చేసారో కానీ.. షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి.. ఆ చిత్రం పైసల సమస్య ఎదుర్కొంటూనే ఉంది. పైసా మహత్యం తెలపడం కోసం తీస్తున్న ఆ సినిమా.. నిర్మాతకు అనుక్షణం పైసా మహత్తు తెలుపుతూనే ఉంది. "పైసా" చిత్ర కథానాయకుడు నాని ఫుల్ ఫామ్‌లో ఉన్నా కూడా విడుదలపరంగా ఆ చిత్రం పలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.
కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా రమేష్‌పుప్పాల నిర్మిస్తున్న "పైసా" ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పతిస్థితుల్లో ఉంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అండదండలతో రమేష్‌పుప్పాల "ఎల్లో ఫ్లవర్స్" అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి.. "మిరపకాయ్", "శ్రీమన్నారాయణ" చిత్రాలను నిర్మించారు. "మిరపకాయ్" మంచి విజయం సాధించగా.. "శ్రీమన్నారాయణ" సోసోగా ఆడింది. అయితే అనంతరకాలంలో.. "ఆర్.ఆర్ మూవీమేకర్స్" అప్పులపాలవ్వడంతో.. ఆ ప్రభావం "ఎల్లో ఫ్లవర్స్"పై పడింది. అందుకే.. హీరోగా నాని ఫుల్‌ఫామ్‌లో ఉన్నా కూడా "పైసా" చిత్రం విడుదలపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది!