English | Telugu

ఆర్యతో "అలాంటిది" ఏమీ లేదు!

నిన్నమొన్నటివరకు ప్రభుదేవాతో "సహజీవనం" (అనధికారిక కాపురం) చేసిన నయనతార ప్రస్తుతం "ఆ తరహా" వ్యవహారం ఆర్య అనబడే హీరోతో సాగిస్తోందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇప్పటివరకూ ఈ విషయమై మౌనం పాటిస్తూ వచ్చిన అందాల తార నయనతార ఎట్టకేలకు ఈ వ్యవహారంపై పెదవి విప్పింది.

"అందరూ అనుకుంటున్నట్లుగా ఆర్యతో తనకు "అలాంటి" సంబంధం ఏమీ లేదని.. అతను తనకు మంచి మిత్రుడు మాత్రమే" అని ఈ వగలాడి ఒయ్యారాలు పోతోంది. ఆర్య, నయనతార ఇంతకుముందు ఓ చిత్రంలో నటించారు. తెలుగులో ఆ చిత్రం "నేనే అంబాని" పేరుతో అనువాదమైంది.

ప్రస్తుతం "రాజా,రాణి" అనే చిత్రంలో ఆర్యతో కలిసి నటిస్తున్న నయనతార మరో చిత్రంలోనూ ఆర్యకు జంటగా నటించేందుకు అంగీకరించింది. పైగా.. ఆర్యకు దూరంగా ఉండడం ఇష్టం లేక.. తెలుగులో ఎన్నో "బంపర్ ఆఫర్స్" వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇవేవీ.. ఎవరికీ తెలియవనుకుంటూ.. ఎంతో అమాయకత్వం నటిస్తూ.. "ఆర్యతో అలాంటిదేమీ లేదు" అంటూ బుకాయించే ప్రయత్నం చేస్తోంది నయనతార!