English | Telugu
'కింగ్‌డమ్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి..!
Updated : Aug 1, 2025
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కింగ్‌డమ్' (Kingdom). సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా గురువారం(జూలై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రికార్డు ఓపెనింగ్స్ ఖాయమని అందరూ భావించారు. కానీ, విడుదల తర్వాత మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఇక బుకింగ్స్ డల్ అవుతాయని, ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. 'కింగ్‌డమ్' అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. నైజాంలో రూ.4.20 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.4.02 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.70 కోట్ల షేర్ తో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి రోజు రూ.9.92 కోట్ల రాబట్టిందని సమాచారం.
Kingdom Day 1 AP & TG Shares - Excl GST
Nizam - 4.20
Ceeded - 1.70
Uttharandhra - 1.16
Guntur - 0.75
East - 0.74
Krishna - 0.59
West - 0.44
Nellore - 0.34
Total - 9.92 crores