English | Telugu

పవన్ తో మిర్చి భామ చిందులు

"మిర్చి" సినిమాలో మిర్చి మిర్చి అంటూ అంటూ తన అందం, డాన్సులతో అదరగొట్టిన హంసనందినికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. "మిర్చి" సినిమా తర్వాత దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న మరో రెండు చిత్రాలలో హంసనందిని ఐటెం సాంగ్ లో చెందేయనుంది.

అయితే వీటిలో ఒకటి నాగార్జున హీరోగా నటిస్తున్న "భాయ్", మరొకటి పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది" చిత్రాలు. వీటిలో ఇప్పటికే నాగార్జునతో కలిసి "భాయ్" చిత్రంలో ఓ కత్తి లాంటి మాస్ సాంగ్ లో నటించేసింది. ఇపుడు పవన్ తో ఐటెం సాంగ్ చేసే డేట్ కోసం హంస ఎదురుచూస్తుందట. "గబ్బర్ సింగ్"లో కెవ్వుకేక వంటి బ్లాక్ బస్టర్ మాస్ మసాలా సాంగ్ తర్వాత పవన్-దేవీల కాంబినేషన్ లో వస్తున్న ఈ పాట మరో బ్లాక్ బస్టర్ కానుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు. ఈ పాట షూటింగ్ త్వరలోనే పవన్, హంస లపై చిత్రీకరించనున్నారు.

మరి ఈ రెండు చిత్రాలలోని మాస్ సాంగ్స్ కనుక హిట్టయితే ఇక హంసకు మరిన్ని అవకాశాలు రావచ్చు.