English | Telugu
మాధవీతో జతకట్టిన గజల్
Updated : Jul 9, 2013
డా. గజల్ శ్రీనివాస్, మాధవీలత(నచ్చావులే ఫేం) హీరో హీరోయిన్లుగా శ్రీ కృష్ణవాసా దర్శకత్వంలో జూలై 3న కొత్త చిత్రం పూజాకార్యక్రమాలు నటీనటుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రాన్ని లతాశ్రీ మూవీస్ నూతన నిర్మాణ సంస్థ M.P. రవిరాజారెడ్డి నిర్మిస్తుండగా, కృష్ణవాసా స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రకథ "ప్రత్యేకమైన కథాంశమని" ఇందులో ఎంతో మంచి పెర్ఫార్మెన్స్ కి అవకాశమున్న కథానాయకుడి పాత్రను చేస్తున్నట్లు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. A Film by Aravind తరువాత ఎంతో జాగ్రత్తగా పాత్రను ఎంచుకొని చేస్తున్న చిత్రమని అయన తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు డా. డిసౌజా, సాయిశర్మ, శ్రీనివాసరెడ్డి, విష్ణుకిశోర్, భానుశ్రీలు నటించనున్నట్లు, ప్రఖ్యాత నటి శ్రీమతి జయలలిత ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు దర్శకులు తెలిపారు. ఈ చిత్రానికి వెంకటహనుమ ఛాయాగ్రహణం నిర్వహిస్తారని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 21 నుండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం, పోడూరు, మేడపాడు, చించినాడ ప్రాంతాలలో జరుగుతుందని తెలిపారు.