English | Telugu
బాలయ్య పక్కన బాలీవుడ్ భామ
Updated : Jul 8, 2013
వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన "రెయిన్ బో" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. అయితే ఇంత కాలానికి మరో పెద్ద హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే పలువురు హీరోయిన్ ల పేర్లు వినిపించినప్పటికీ... తాజాగా సోనాల్ చౌహాన్ ను మొదటి హీరోయిన్ గా ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విదేశాలలో జరుపుకుంటుంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.