English | Telugu
గుండెపోటుతో ప్రముఖ సింగర్ మృతి
Updated : Jul 25, 2025
భారతీయ చిత్ర పరిశ్రమలో సింగర్ 'బబ్లామెహతా'(Babla Mehta)కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అద్భుతమైన పాటల్ని ఆలపించిన బబ్లా 'గోల్డెన్ వాయిస్ ఆఫ్ ముఖేష్' గా కూడా కీర్తిని గడించాడు. లెజండ్రీ గాయనిమణి 'లతా మంగేష్కర్'(Lata Mangeshkar)తో కలిసి కూడా పాడటం జరిగింది.
ఈ నెల 22 వ తారీఖున బబ్లా మెహతా ముంబైలో గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా బయటకి రాగా, బబ్లా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియచేసారు. కొన్ని చిత్రాలకి సంగీతాన్ని కూడా అందించడంతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా తన స్వరకల్పనలో వచ్చాయి.
దిల్ హై కే మంత నహిన్, చాందిని, సడక్, తహల్కా, మేజర్ సాబ్ చిత్రంలోని పాటలు మెహతాకి మంచి గుర్తింపుని ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన వయసు 65 సంవత్సరాలు కాగా 'ఢిల్లీ' స్వస్థలం.