English | Telugu

ప్రముఖ నటిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి!

ప్రముఖ నటి కల్పిక గణేష్ పై ఆమె తండ్రి సంఘవార్ గణేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందని, రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందని, ఆమెను వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాలని.. సంఘవార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. (Kalpika Ganesh)

'ఆరెంజ్', 'జులాయి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలతో గుర్తింపు పొందిన కల్పిక.. కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో బర్త్ డే కేక్ విషయంలో ఓ పబ్ సిబ్బందితో ఆమె గొడవ పడ్డారు. అలాగే, ఇటీవల ఓ రిసార్ట్ మేనేజర్ పై బూతులతో విరుచుకుపడ్డారు. ఇలా తరచూ కల్పిక ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఆమె తీరుపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కల్పన తండ్రే.. ఆమెపై కంప్లైంట్ చేయడం సంచలనంగా మారింది.

కల్పిక కొంతకాలంగా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుందని ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు తెలిపారు. కల్పిక డిప్రెషన్ లో ఉందని, గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని పేర్కొన్నారు. బోర్డర్ లైన్ నార్సిసిస్టిక్ డిజార్డర్ తో బాధపడుతున్న కల్పిక గతంలో ట్రీట్మెంట్ తీసుకుందని, కానీ రెండేళ్ళు గా మెడికేషన్ ఆపివేసిందని అన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలిస్తే.. అక్కడ ఉండకుండా వచ్చేసిందని చెప్పారు. దీంతో కల్పిక తరచూ గొడవలు సృష్టిస్తుందని, ఆమెను రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గచ్చిబౌలి పోలీసులకు సంఘవార్ గణేష్ ఫిర్యాదు చేశారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.