English | Telugu

సినిమా పేరు:మిరాయ్
బ్యానర్:పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
Rating:2.75
విడుదలయిన తేది:Sep 12, 2025

సినిమా పేరు: మిరాయ్
తారాగణం:  తేజ సజ్జ, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం తదితరులు 
మ్యూజిక్:గౌర హరి 
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, 
మాటలు: మణిబాబు కరణం   
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత: టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్  
విడుదల తేదీ: సెప్టెంబర్ 12 ,2025 

పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మిరాయ్'(Mirai)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రస్తుత కాలానికి పురాణ ఇతిహాసాలతో ముడిపడిన కథ కావడం,  తేజ సజ్జ నుంచి హనుమాన్ లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో, మిరాయ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
కళింగయుద్ధంలో అశోకుడు విజయం సాధిస్తాడు. కానీ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోవడంతో  పశ్చాత్తాపడతాడు. దాంతో తనకున్న గర్వం వదలాలని తనకి ఉన్న తొమ్మిదిశక్తులని కొంత మందికి అప్పచెప్తాడు. తరతరాలుగా కాపాడకుంటు వస్తున్న ఆ శక్తుల్లో చివరి దానికి అంబిక(శ్రేయ) రక్షణగా ఉంటుంది. ఇందుకు అగస్త్య మహర్షి కూడా అండగా ఉంటాడు. అంబిక కి వచ్చే పాతికేళ్లలో జరగబోయేది ముందే తెలుసు. ఈ క్రమంలోనే మహావీర్(మనోజ్) అశోకుడి శక్తులని పొందుతాడని తెలుసుకుంటుంది. ఆ శక్తీ మహావీర్ కి చేరితే మానవాళికే ప్రమాదమని  చివరి శక్తిని ఎవరు చేరుకోలేని 'తంత్రవనం' ప్లేస్ లో ఉంచుతుంది. పుట్టినప్పటి నుంచి రకరకాల ఊళ్లల్లో తిరిగే వేద(తేజ సజ్జ) హైదరాబాద్ లో మనుషులని ప్రమాదం లేని కొన్ని ఇల్లీగల్ పనులు చేసుకుంటుంటాడు. కానీ ఆ పనుల వల్ల ఎదుటివారికి మంచే జరుగుతుంది. వేద కోసం హిమాలయాల దగ్గర్నుంచి విభా(రితికా నాయక్) వచ్చి మహావీర్ నుంచి కాపాడమని కోరుతుంది. ఎదుటివారి నుదుటిపై  ఏముందో చూడగలిగే శక్తీ ఆమె సొంతం?  మహావీర్ నుంచి కాపాడమని 'వేద' నే ఎందుకు అడిగింది? మహావీర్ పొందాలని చూస్తున్న అశోకుడి శక్తులకున్న పవర్ ఏంటి? అవి పొందితే మానవాళికి కలిగే ముప్పేంటి?  అసలు వేద ఎవరు? అతని జన్మ రహస్యంలో ఏమైనా శక్తి దాగి ఉందా? అంబిక దాచిన శక్తీ ఎక్కడ ఉంది? మహావీర్ నుంచి మానవాళిని వేద ఎలా కాపాడాడు? ఆ శక్తులకి 'మిరాయ్' కి ఉన్న సంబంధం ఏంటి?  త్రేతా యుగంలో శ్రీరాముడుకి ఈ కథ కి ఏమైనా  సంబంధం ఉందా? అగస్త్య మహర్షి  పాత్ర ఏంటి? వేద చేసిన పోరాటం ఏంటి?  మహావీర్ నుంచి మానవాళిని వేద ఎలా కాపాడాడు?  అనేదే ఈ చిత్ర కథ.  


ఎనాలసిస్ :

కొన్నిచిత్రాలు సిల్వర్ స్క్రీన్ పైకి రావాలంటే, సిల్వర్ స్క్రీన్ ఎంతో పెట్టి పుట్టాలనే విషయాన్నీ కొన్ని సినిమాలు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాయి. అలాంటి ఒక చిత్రమే 'మిరాయ్'. శక్తులని పొందటం కోసం వేద జరిపే పోరాటాన్ని ఇంకొంచం భారీగా చూపించాల్సింది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆ విషయాన్నీ మర్చిపోయేలా చేసాయి. ముఖ్యంగా మహావీర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా ప్లస్ అయ్యింది. అసలు సినిమా చూస్తున్నంత సేపు మనకి మనం ఎంతో తన్మయత్వం చెందుతాం. అంత రిచ్ గా, గ్రాండ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ చూస్తే కళింగ యుద్ధం అశోకుడు తీసుకున్న నిర్ణయంతో,ఒక సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనే విషయం అర్థమైపోతుంది. అంబిక క్యారక్టర్ ఎంట్రీ, ఆమె త్యాగం ప్రతి ఒక్క హృదయాన్ని తాకడమే కాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్సుహకతో  'మిరాయ్' కి సరెండర్ అయిపోతాం. తేజ సజ్జ కోసం విభా రావడం, ఆమె మధ్య వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయించాయి. మహావీర్ క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ విధానంగా  పర్ఫెక్ట్ గా కుదిరింది. అందుకు తగ్గట్టే యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో సాగాయి. వివిధ లొకేషన్స్ లో వాటి చిత్రీకరణ ఐ ఫీస్ట్ కలిగించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. ఇక సెకండ్ హాఫ్ ఎంతో వేగంగా కదిలింది. తేజ సజ్జ తొమ్మిదో శక్తి కోసం వెళ్లడం, అంబిక త్యాగానికి సంబంధించిన సీన్స్ హైలెట్. మధ్య మధ్యలో వచ్చిన పోలీస్ ఎపిసోడ్ తో పాటు అంగమ్మ బలి క్యారక్టర్ కూడా హైలెట్. కాకపోతే రామాయణ కాలానికి సంబంధించి కొన్ని సీన్స్ కూడా కథ కి పారలల్ గా లింక్ చేసినట్టయిపోతే ఇంకా బాగుండేదేమో. క్లైమాక్ అయితే సూపర్.


నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు 

వేద క్యారక్టర్ లో తేజ సజ్జ(Teja Sajja)అద్భుతమైన పెర్ఫార్మెన్సుని ప్రదర్శించాడు. అగ్ర హీరో రేంజ్ లో నటనకి సంబంధించిన అన్నివిభాగాల్లోను తనదైన శైలిలో మరోసారి విజృంభించాడు. మహావీర్ క్యారక్టర్ లో మంచు మనోజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పర్ఫెక్ట్ విలనిజం ప్రదర్శించడంతో పాటు, రన్నింగ్ డైలాగుని ఆపి, మళ్ళీ వెంటనే నొక్కి మరి చెప్పడంలో తన తండ్రి మోహన్ బాబు ని గుర్తుచేశాడు. మనోజ్ పెర్ఫార్మ్ ఎంతలా సాగిందంటే పాన్ ఇండియా లెవల్లో మనోజ్ విలన్ గా బిజీ అయినా ఆశ్చర్యపడాల్సిన లేదు. అంబిక క్యారక్టర్ లో కూడా శ్రేయ పర్ఫెక్ట్ గా సూటయ్యింది.  ఆమె కోసమే ఆ క్యారక్టర్ ని డిజైన్ చేశారేమో అనేంతలా శ్రీయ(Sriya)నట ప్రస్థానం కొనసాగింది. శ్రీయకి మరిన్ని సినిమాల్లో అవకాశాలు రావచ్చు. అగస్త్య మహర్షి గా చేసినా జయరాం నట జీవితంలో మిరాయ్ ఒక మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోతుంది.

పోలీస్ క్యారక్టర్ లో చేసిన ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల సూపర్ పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. తెలుగు సినిమాకి ఇంకో క్యారక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టే. ఇక దర్శకుడు, ఫోటోగ్రఫీ బాధ్యతలని నిర్వహించిన 'కార్తీక్ ఘట్టమనేని'(Karthik Gattamneni)గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి సీన్ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు, విజువల్ గా కూడా వండర్ క్రియేట్ చేసాడు. కార్తీక్ ఘట్టమనేని నుంచి మళ్ళీ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా తన దర్శకత్వ ప్రతిభ కొనసాగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్(Tg Vishwa Prasad),కృతి ప్రసాద్(Kriti Prasad)ల నిర్మాణ విలువలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మిరాయ్ తో బ్యానర్ కి ఉన్నతమైన గుర్తింపు రావడంతో పాటు వాళ్ల జన్మ కూడా ధన్యమైనట్టే. గౌర హరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  అదనపు బలాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ కూడా  అందంగా మలిచింది


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

ఫైనల్ గా చెప్పాలంటే సెల్యులాయిడ్ పై 'మిరాయ్' ద్వారా ఒక కొత్త ప్రపంచం ప్రత్యక్షమైంది. అందుకు సాక్ష్యం తేజ సజ్జ, మంచు మనోజ్,శ్రీయ, రితికా నాయక్, జయరాం ల నటన, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వ ప్రతిభ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలే.

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 1.75

తెలుగు వన్ రేటింగ్ : 2.25

తెలుగు వన్ రేటింగ్ : 2.75

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 2.00

తెలుగు వన్ రేటింగ్ : 2.50