English | Telugu
బ్యానర్:షైన్ స్క్రీన్స్
Rating:2.00
విడుదలయిన తేది:Sep 12, 2025
సినిమా పేరు: కిష్కింధపురి
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, సాండీ, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, మకరంద్ దేశ్ పాండే తదితరులు
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
ఎడిటర్: నిరంజన్ దేవర మన్నే
రచన, దర్శకత్వం: కౌశిక్ పెగుళ్ల పాటి
సినిమాటోగ్రాఫర్: చిన్మయ్ సలాస్కర్
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
విడుదల తేదీ: సెప్టెంబర్ 12 ,2025
'రాక్షసుడు' చిత్రంతో హిట్ ఫెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellakonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఈ రోజు 'కిష్కింధపురి'(Kishkindhapuri)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హర్రర్, మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మేకర్స్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రాఘవ,(బెల్లంకొండ సాయి శ్రీనివాస్) మైథిలి( అనుపమ పరమేశ్వరన్) లు కస్టమర్ల కి 'ఘోస్ట్'లు ఉంటాయని, ముద్రపడ్డ ప్లేస్ లని చూపించే జాబ్ చేస్తుంటారు. కస్టమర్లని మెప్పించే క్రమంలో దెయ్యాలు ఉన్నట్టుగా కూడా చీట్ చెయ్యడంలో ఆ ఇద్దరు మంచి దిట్ట. పదకొండు మంది కస్టమర్స్ తో 'కిష్కింద పురి' అనే గ్రామంలోని 'సువర్ణ మహల్ రేడియో స్టేషన్' అనే పాడుబడిన భవంతికి వెళ్తారు. 80 వ దశకానికి చెందిన ఆ భవంతిలోకి విశ్రవన్ పుత్ర (సాండీ) ఆత్మ ప్రవేశించి వెళ్లిన వాళ్ళందర్నీ ఒక్కొక్కరిగా చంపుతుంటుంది. విశ్రవన్ పుత్ర ఎందుకు వాళ్ళందర్నీ చంపుతున్నాడు? పదకొండు మందిలో ఎంత మంది చనిపోయారు? రాఘవ ఎంతమందిని కాపాడాడు? విశ్రవన్ పుత్ర గతం ఏంటి? సువర్ణ మహల్ లో ఎందుకు ఉన్నాడు? రాఘవ, మైథిలి లు విశ్రవన్ విషయంలో ఏం చేసారు? అనేదే ఈ చిత్ర కథ.
ఎనాలసిస్ :
కథ ని లైన్ గా చెప్పుకుంటే బాగానే ఉంది. కానీ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చే సరికి సరైన కథనాలు, డైలాగులు లేకపోవడంతో కిష్కింధపురి మెప్పించలేకపోయింది. ఈ కథకి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించవచ్చు. కానీ మేకర్స్ ఆ దిశగా ఆలోచించలేదు. డైలాగులు కూడా సన్నివేశానికి, క్యారెక్టర్స్ కి తగ్గట్టు లేవు. రాఘవ, మైథిలి లు దెయ్యాలు ఉన్నట్టుగా కస్టమర్స్ ని చీట్ చేస్తుంటారు. అలాంటప్పుడు తమకి తెలియని సువర్ణ మహల్ రేడియో స్టేషన్ అనే కొత్త బిల్డింగ్ లోకి వెళ్తున్నప్పుడు, సదరు బిల్డింగ్ గురించి ఎంక్వయిరీ చెయ్యాలి. కనీసం ఆ ఇద్దరు ఆ బిల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈ యాంగిల్ లో రాఘవ, మైథిలి, కస్టమర్ల మధ్య కావాల్సినంత కామెడీ ని సృష్టించవచ్చు. ఆ దిశగా చెయ్యలేదు. అసలు రాఘవ, మైథిలి క్యారక్టరయిజేషన్ కి ఒక డిజైన్ లేదు. కొన్ని సీన్స్ లో అయితే ఆర్టిస్టులు పెర్ఫార్మ్ చెయ్యడానికి కూడా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ప్రారంభంలో చెప్పిన సీన్ రొటీన్. రాఘవ ఎంట్రీ బాగుంది. ఆ తర్వాత సువర్ణ మహల్ రేడియో స్టేషన్ కి వెళ్లడం, ఒక్క్కొక్కరు చనిపోవడం కూడా రొటీన్. ఫస్ట్ హాఫ్ లోనే రివర్స్ స్క్రీన్ ప్లే లో విశ్రవన్ పుత్ర, ఆమె తల్లి క్యారక్టర్ ని చూపిస్తూ ఉండాల్సింది. తద్వారా పదునైన స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్ట్ కలిగేది. ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్గగా పేలలేదు. సెకండ్ హాఫ్ లో విశ్రవన్ పుత్ర గురించి రాఘవ తెలుసుకునే ప్రాసెస్ సెట్ అవ్వలేదు. కాకపోతే విశ్రవన్ పుత్ర క్యారక్టర్ డిజైన్ బాగుంది. తల్లి లేకున్నా తల్లి ఉందని ఊహించుకునే సస్పెన్సు తో పాటు ఫ్లాష్ బ్యాక్ పర్లేదు. తనికెళ్ళ భరణి ఎపిసోడ్ కూడా బాగా పేలింది. ఇక్కడ నుంచైనా కథనంలో వేగాన్ని పెంచి క్యూరియాసిటీ ని కలిగించవచ్చు. కానీ ఎన్నో సినిమాల ఇన్స్పిరేషన్ తో అర్ధం, పర్ధం లేని సన్నివేశాలని మిక్స్ చేసి సినిమాని ముగించేశారు. పెద్దగా భయపెట్టింది కూడా లేదు.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
రాఘవ క్యారక్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. కానీ సబ్జెట్ లో పస లేకపో వడంతో ఒకే తరహా పెర్ఫార్మ్ ని ప్రదర్శించాల్సి వచ్చింది. మైథిలిగా అనుపమ పరమేశ్వరన్ నటనలో కూడా పెద్దగా మెరుపులు లేవు. విశ్రవన్ పుత్ర గా సాండీ బాగానే చేసాడు. మూవీ మొత్తంపై ఎక్కువ నటనని కనపర్చిన క్యారక్టర్ ఇదే. తనికెళ్ళ భరణి, ప్రేమతో పాటు మిగతా క్యారెక్టర్స్ ఉన్నా వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. కౌశిక్ పెగుళ్ల పాటి దర్శకుడుగా, రచయితగా ఫెయిల్ అయ్యాడు. కథకి తగ్గ కథనాల్ని, డైలాగ్స్ ని సృష్టించుకోలేకపోయాడు. బెల్లంకొండ, అనుపమ లాంటి మంచి నటుల్ని ఉపయోగించుకోలేకపోయాడు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెరుపులు ఏం లేవు. ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఫైనల్ గా చెప్పాలంటే.. కథ లైన్ బాగానే ఉన్నా, కథకి తగ్గ కథనం లేకపోవడం, నటీనటుల్ని సరిగా ఉపయోగించుకోలేకపోవడం మైనస్.