Read more!

English | Telugu

సినిమా పేరు:జయ జయ జయ జయ హే
బ్యానర్:చీప్ ఎంటర్ టైన్ మెంట్
Rating:3.00
విడుదలయిన తేది:Dec 30, 2022

చిత్రం : జయ జయ జయ జయ హే.
తారాగణం: దర్శనా రాజేంద్రన్, బేసిల్ జోసఫ్, అజు వర్గీస్, అజీజ్ తదితరులు.
సంగీతం: అంకిత్ మీనన్.
సినిమాటోగ్రఫీ: బబ్లూ అజు.
దర్శకత్వం: విపిన్ దాస్.
నిర్మాతలు: లక్ష్మీ వారియర్, గణేష్ మీనన్.
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్.

ఏదైనా సరే కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు అటోమేటిక్ గా ఆ సినిమాను ఇష్టపడతారని, మరోసారి ఋజువు చేస్తూ వచ్చేసింది.. ‌సరికొత్త మూవీ 'జయ జయ జయ జయ హే'. సినిమా పేరు చూసి మొదటగా దేశభక్తి మూవీ అనుకుంటారందరూ.. కానీ అసలు కథ సినిమా చూస్తేనే తెలుస్తుంది.

కథ: 
సినిమా మొదట హీరోయిన్ దర్శన జయ పాత్రలో కనిపిస్తుంది. ఆమె స్కూల్ లైఫ్ తో మొదలవుతుంది. తను కాలేజ్ లోనే ఒక ప్రొఫెసర్ ని ఇష్టపడుతుంది. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిసి, బుద్ది చెప్తాడు. ఆ తర్వాత హీరో బేసిల్ జోసఫ్ రాజేశ్ పాత్రలో కనిపిస్తాడు. రాజేశ్ కి జయకి పెళ్ళి చూపులు పెడతాడు జయ వాళ్ళ నాన్న. ఇక రాజేశ్ పెళ్ళిచూపులలో చాలా వినయంగా, అమాయకుడిలా నటిస్తాడు. జయ స్వతంత్రంగా బ్రతకాలనుకునే వ్యక్తిత్వం కలది కావడం వల్ల పెళ్ళి తర్వాత డిగ్రీ చదువు పూర్తి చేస్తానని చెప్తుంది. దానికి రాజేశ్ ఒప్పుకుంటాడు. ఇక పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత ఏదో రాజేశ్ భర్త అనే అధికారంతో ఏదో ఒక సాకుతో, కోపం వచ్చిన ప్రతీసారీ జయని  కొడుతూ ఉండేవాడు. ఇక  జయకి ఓపిక నశిస్తుంటుంది. రోజు రోజుకి రాజేశ్ పెత్తనం, కోపం అన్నీ పెరిగిపోతాయి. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజేశ్ ఇంటికి వస్తాడు. ఇక ఏదో ఒక మాటకి మన జయని కొడుతూంటే తను ఆపి, కరాటే స్టైల్ లో  గట్టిగా ఒక తన్ను తన్నేసరికి రాజేశ్ ఎక్కడో పడతాడు. ఇక అప్పుడు సినిమాలో మొదటి ట్విస్ట్ రివీల్ అవుతుంది. రాజేశ్ పెట్టే టార్చర్ భరించలేక జయ కరాటే నేర్చుకుందని, అలా నేర్చుకునే.. రాజేశ్ ని కొట్టిందని తెలుస్తుంది. ఇక రాజేశ్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతుంటాడు. అలా మొదటిసారి మన జయ కొట్టిన కొట్టుడుకి రాజేశ్ కి భయం పుట్టుకొస్తుంది. తను ఏది పెడితే అది తింటాడు. ఆ తర్వాత మన రాజేశ్ వాళ్ళ అన్నకి చెప్పుకుంటాడు. అన్న ఇచ్చిన సలహా మేరకు ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. అయితే అందులో రికార్డు చేసిందంతా సోషల్ మీడియాలో లీక్ అవుతుంది. అది కాస్తా వైరల్ అవుతుంది. ఇక రాజేశ్ తర్వాత ఎలాంటి పరిస్థితులు అనుభవించాడో? జయ సమాజంలో ఎలా బ్రతకగలిగిందో చూడాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.


ఎనాలసిస్ :

ఈ సినిమా కథ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ ప్రేక్షకులకు ఒక సరికొత్త జోనర్ ని పరిచయం చేసాడు డైరెక్టర్. కథని స్లోగా మొదలుపెట్టినా కూడా ఇంటర్వెల్ కి ఒక క్లారిటి వచ్చేస్తుంది. కానీ అసలు కథ అప్పుడే మొదలవుతుంది. చివరలో జయ రివీల్ చేసే ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సీరియస్ విషయాన్ని కామెడీ మిక్స్ చేసి, చివరి వరకూ ప్రేక్షకులకు సస్పెన్స్ ని రివీల్ చేయకుండా మలిచిన తీరు బాగుంది.

నటీనటుల పనితీరు:

రాజేశ్ పాత్రలో బేసిల్ జోసఫ్ బాగా చేసాడు. దర్శన రాజేంద్రన్ జయ పాత్రలో ఇమిడిపోయింది.  ఇక సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినవాళ్ళు పర్వాలేదనిపించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

తిట్టినా, కొట్టినా భార్య పడి ఉంటుందనే భ్రమలో ఉండే భర్తకి.. భార్య తిరగబడితే ఎలా ఉంటుందో చూపించిన ఈ చిత్రం ఆకట్టుకునేలా ఉంది. సీరియస్ అంశాన్ని తీసుకొని దర్శకుడు సరదాగా నడిపించిన తీరు మెప్పించింది.

✍🏻. దాసరి మల్లేశ్