English | Telugu
ఏపీలో స్ధానిక పోరు వాయిదా వెనుక ఎవరి హస్తం?.. రాష్ట్రంలో ఆసక్తికర చర్చ
Updated : Mar 17, 2020
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయించడంలో ఎవరి హస్తం ఉంది అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.. అధికారంలో లేకపోయినా చంద్రబాబు ఇంత లాబీ చేయించే పరిస్థితిలో ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. రాత్రికి రాత్రే ఎన్నికల కమిషన్ ఇంత తీవ్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడం కూడా మరింత చర్చనీయాంశం అవుతోంది.....ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలు వాయిదా అంశం అన్ని రాజకీయ పార్టీలతో పాటు అధికార వర్గాలలో కూడా చర్చగా మారింది...
ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో ఎన్నికల కమిషనర్ ని మ్మగడ్డను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనేజ్ చేసారనే అభిప్రాయాలు బాగా వ్యక్తం అవుతున్నాయి...సీఎం జగన్ నుంచి మంత్రులు వైసీపీ నేతల వరకు ఇదే విమర్శ.......చంద్రబాబు ఎన్నికలను ఆపించే పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా ఆయనకు ఇంకా బోల్డంత క్రేజ్ ఉన్నట్టే అనుకోవాలి.....సామిజిక కోణం పక్కన పెడితే ఒక కీలక మైన ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు మేనేజ్ చేసి ఎన్నికలు వాయిదా వేయించే పరిస్థితి ఉన్నట్టయితే భవిష్య్ త్ లో జరిగే పరిణామాలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి......
స్థానిక సంస్థల వాయిదా వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి...బిజెపి శ్రేణుల పై దాడులు జరగడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది....ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కలిసినా పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు...దీంతో ఈ రెండు పార్టీలు సరైన విజయం పక్కన పెడితే కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపించకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది....దీంతో రాష్ట్రంలో జరిగిని హింసాత్మక సంఘటనలు కూడా బిజెపి సీరియస్ గా తీసుకుంది..సొంత పార్టీ నాయకులపైనే దాడులు జరగడం ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోతే నష్టం జరగడం వీటిని ద్రుష్టిలో పెట్టుకుని కేంద్రంతో మాట్లాడి బిజెపి నేతలు ఎన్నికలు వాయిదా వేయించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి....
దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కూడా తీవ్రంగా ఉండడం కూడా ఒక కారణం అయింది..వై సీపీ నేతల విమర్శల ప్రకారం చంద్రబాబు వాయిదా వెనుక ఉండే పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు....ఒక వేళ నిజంగా ఆయన హస్తం ఉంటే బాబు పవర లో లేకపోయినా పవర్ ఫుల్ గా ఉన్నట్టే లెక్క....వైసీపీ అండ్ ప్రభుత్వం బాబుపై విమర్శలు చేసి ఆయన్ని అనవసరంగా ఇంకా పెద్ద హీరోను చేస్తోందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.